Rowdy Boys: అనుపమని చూస్తుంటే ‘మేరీ’నే గుర్తొస్తుంటుంది: విజయ్‌ దేవరకొండ - telugu news actor vijay deverakonda speech at rowdy boys song launch anupama
close
Published : 20/10/2021 22:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rowdy Boys: అనుపమని చూస్తుంటే ‘మేరీ’నే గుర్తొస్తుంటుంది: విజయ్‌ దేవరకొండ

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్‌. ఆయన నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ‘హుషారు’ ఫేం హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఈ చిత్రం నవంబరు 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ ‘ప్రేమే ఆకాశం’ అనే గీతాన్ని విడుదలచేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర దర్శకుడు హర్ష, నాయకానాయికలు ఆశిష్‌, అనుపమతో నాకు పరిచయం ఉంది. ఈ సినిమా ప్రచారంలో నేనూ ఓ భాగమవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమకి రాకముందు నుంచే నాకు హర్ష తెలుసు. మంచి సినిమా కథలు చెప్తుండేవాడు. అలా ఎన్నో కథలు విన్నాను. ఇప్పటికీ తను కాలేజీ కుర్రాడిలానే ఆలోచిస్తాడు. తెరపై కాలేజీ ఫీలింగ్స్‌, ఎమోషన్స్‌ని బాగా పండిస్తాడు. ఈ చిత్రం ‘హుషారు’ని మించిన విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. అనుపమని చూస్తుంటే ‘ప్రేమమ్‌’లోని మేరీ పాత్రే నాకు గుర్తొస్తుంటుంది. సహజమైన నటన ఆమెది. ‘ప్రేమే ఆకాశం’లోనూ అలానే కనిపించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందు ఓ సారి ఆశిష్‌ నన్ను కలిశాడు. సినిమా అంటే తనకి ఎంత ప్యాషన్‌ ఉందో నాకు అప్పుడే అర్థమైంది’ అని అన్నారు.




Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని