TS Politics: తెలంగాణ అభివృద్ధిని కేసీఆరే అడ్డుకుంటున్నారు: విజయశాంతి - telugu news bjp senior leader vijayashanti comments on trs govt
close
Updated : 25/08/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS Politics: తెలంగాణ అభివృద్ధిని కేసీఆరే అడ్డుకుంటున్నారు: విజయశాంతి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరనివ్వకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంటోందని భాజపా సీనియర్‌ నేత విజయశాంతి విమర్శించారు. తద్వారా తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆరే అడ్డుపడ్డుతున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించిన పాటల సీడీని ఆమె హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఏడేళ్ల పాలనలో తెరాస పాలన అవినీతిని పాటల ద్వారా ఎండగట్టామని తెలిపారు. భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ భాజపానే అని విజయశాంతి స్పష్టం చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని