Viveka murder case: వైఎస్‌ వివేకాను హత్య చేసినవారు జగన్‌కు తెలుసు: బీటెక్‌ రవి - telugu-news-btech ravi comments on viveka murder case
close
Published : 03/08/2021 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viveka murder case: వైఎస్‌ వివేకాను హత్య చేసినవారు జగన్‌కు తెలుసు: బీటెక్‌ రవి

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి కచ్చితంగా తెలుసని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన రవి.. వివేకా హత్యకేసుపై స్పందించారు. ‘‘వివేకా హత్య కేసులో నిందితులను తప్పించేందుకు సీఎం జగన్‌ ప్రణాళిక వేశారు. గతంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇప్పుడు సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ దర్యాప్తు నుంచి తప్పుకున్నారు. ఈ రెండు అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు నిందితులను తప్పించేందుకు సీఎం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు’’ అని ఆరోపించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని