Cyclone Gulab: తుపాను బాధితులకు అండగా తెదేపా: చంద్రబాబు - telugu news chandrababu requests government to take preventive measures
close
Published : 27/09/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cyclone Gulab: తుపాను బాధితులకు అండగా తెదేపా: చంద్రబాబు

అమరావతి: గులాబ్ తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలన్నారు. బాధితులకు తెదేపా శ్రేణులు అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. తుపాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని.. ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని సూచించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని