Cinema news: చిరంజీవి-అల్లు అర్జున్‌తో శ్రీకాంత్‌ అడ్డాల మల్టీస్టారర్‌? - telugu news chiranjeevi and allu arjun join hands for srikanth addala new project
close
Published : 29/10/2021 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: చిరంజీవి-అల్లు అర్జున్‌తో శ్రీకాంత్‌ అడ్డాల మల్టీస్టారర్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొంతకాలంగా తెలుగు తెరపై మల్టీస్టారర్‌ చిత్రాలు వరుస కడుతున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ వంటి భారీ మల్టీస్టారర్‌ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్‌ పట్టాలెక్కే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్‌. యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ఉన్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తయింది. ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ‘భోళా శంకర్‌’ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

తాజాగా చిరుకు శ్రీకాంత్‌ అడ్డాల ఓ కథ వినిపించారట. శ్రీకాంత్‌ చెప్పిన కథకు చిరు సానుకూలంగా స్పందించారని, పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయన్నారని సమాచారం. ఇందులో చిరంజీవితో పాటు మరో కీలకమైన పాత్ర ఉండగా, దానికి అల్లు అర్జున్‌ అయితే బాగుంటుందని శ్రీకాంత్‌ సూచించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే బన్ని ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యే అవకాశం లేకపోలేదు. గతంలో చిరు నటించిన ‘డాడీ’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రాల్లో అల్లు అర్జున్‌ తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. ఒక రకంగా మల్టీస్టారర్‌ చిత్రాలకు మళ్లీ నారు, నీరు పోసిన ఘనత శ్రీకాంత్‌కే దక్కుతుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం అందరినీ మెప్పించింది. మరి చిరుకు శ్రీకాంత్‌ వినిపించిన కథ ఏంటి? ఆయన పాత్ర ఎలా ఉంటుంది?అసలు సినిమా పట్టాలెక్కుతుందా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని