Cm jagan Review: ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్‌ - telugu-news-cm jagan review on corona preventive measures
close
Published : 28/07/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cm jagan Review: ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్‌

అమరావతి: కరోనా చికిత్స చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైపు సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం నిపుణులను నియమించటంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ మరమ్మతులు, ఇతర వైద్య పరికరాల అనుబంధ విభాగాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలన్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం సూచించారు. వంద పడకలు కలిగిన ప్రైవేటు ఆస్పత్రులు మొదటి ప్రాధాన్యంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం 30 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త వైద్య కళాశాలల కోసం భూ సేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ కేటాయింపులు, తక్కువ వినియోగంపై మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్టు జగన్ స్పష్టం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని