అక్రమాలు జరగకపోతే దేవినేని వెళ్తే అభ్యంతరమెందుకు?: ప్రత్తిపాటి - telugu news ex minister pratthipati pullarao pressmeet
close
Updated : 01/08/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్రమాలు జరగకపోతే దేవినేని వెళ్తే అభ్యంతరమెందుకు?: ప్రత్తిపాటి

చిలకలూరిపేట: కొండపల్లిలో నిజాలను వెలికితీసేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేసిందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పుల్లారావు మీడియాతో మాట్లాడారు. అవినీతిని ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కొండపల్లిలో ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు జరగలేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు దేవినేని ఉమ పరిశీలనకు వెళ్తే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 

సీఎం జగన్‌ నాయకత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని.. ఒక్కో ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న వనరులను దోచుకుంటూ రూ.200కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు కొల్లగొడుతున్నారని పుల్లారావు ఆరోపించారు. చిలకలూరిపేటలో రోజూ 500 లారీల మట్టి, ఇసుక తరలిపోతోందన్నారు. రోడ్ల అభివృద్ధికి మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. దీనికి కారణం గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమేనని చెప్పారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని