Karthikeya: వైభవంగా హీరో కార్తికేయ నిశ్చితార్థం - telugu news hero karthikeya got engaged
close
Published : 23/08/2021 09:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Karthikeya: వైభవంగా హీరో కార్తికేయ నిశ్చితార్థం

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్‌ హీరో కార్తికేయ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం కార్తికేయ నిశ్చితార్థానికి హాజరై అభినందనలు తెలిపారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కార్తికేయ మనువాడబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినీరంగంపై ఆసక్తితో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2017లో విడుదలైన ‘ప్రేమతో మీ కార్తీక్‌’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది. అనంతరం వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఆయనకు సూపర్‌హిట్‌ అందించింది. కేవలం హీరో రోల్స్‌ మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగాను ఆయన మెప్పిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని