Yashika Anand: నేనింకా బతికే ఉన్నందుకు బాధపడుతున్నా - telugu news i will forever feel guilty to be alive says actress yashika
close
Updated : 04/08/2021 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Yashika Anand: నేనింకా బతికే ఉన్నందుకు బాధపడుతున్నా

చెన్నై: ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో నటి యాషికా ఆనంద్‌కు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. వీకెండ్‌ సందర్భంగా స్నేహితులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లిన సమయంలో యాషికా కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమె స్నేహితురాలు పావని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలి మృతి పట్ల ఆమె స్పందించారు. స్నేహితురాలితో గడిపిన రోజుల్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.

‘ప్రస్తుతం జీవితంలో అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేనింకా ప్రాణాలతో ఉన్నందుకు చింతిస్తున్నాను. ఆ ప్రమాదం నుంచి బయటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో లేదా నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయినందుకు ఆయన్ని నిందించాలో అర్థం కావడం లేదు. పావని.. ప్రతి క్షణం నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నా. నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని!! నీ కుటుంబాన్ని బాధాకరమైన పరిస్థితుల్లోకి నెట్టినందుకు నన్ను క్షమించు!! నువ్వు మళ్లీ మా మధ్యకు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా బుధవారం (ఆగస్టు 4) తన పుట్టినరోజుని ఎవరూ సెలబ్రేట్‌ చేయవద్దని యాషిక తన అభిమానులకు సూచించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని