MAA Elections: ‘మా’ ఎన్నికలు.. చిరు నాకే ఓటు వేస్తారు: మంచు విష్ణు - telugu news manchu vishnu latest interview on maa election
close
Published : 26/09/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ‘మా’ ఎన్నికలు.. చిరు నాకే ఓటు వేస్తారు: మంచు విష్ణు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి  ఓటు తనకే వేస్తారని నటుడు మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విష్ణు ఇటీవల తన ప్యానల్‌ ప్రకటించారు. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మా’కు శాశ్వత భవనం లేకపోవడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే భరిస్తా. నిర్మాతగా దెబ్బతిన్నప్పటికీ.. అప్పు తీసుకువచ్చి దాన్ని నిర్మిస్తాను. కొత్త నటీనటులు ఎక్కువమంది ఇండస్ట్రీలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటా. సినీయర్‌ నటీనటులకు అన్నిరకాలుగా అండగా ఉంటా. నటీనటుల పిల్లల చదువుల కోసం సాయం అందిస్తా. ఇలా ప్రతి విషయంపై నేను స్పష్టతతో ఉన్నా. ప్రకాశ్‌రాజ్‌ కంటే కూడా నేను బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలను. అందుకే పోటీలోకి దిగాను. ఇప్పటివరకూ మెగాస్టార్‌ చిరంజీవిని కలవలేదు. నామినేషన్‌ వేసిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించి.. చిరుని కలుస్తాను. నా విజన్‌ విన్నాక ఆయన తప్పకుండా నాకు ఓటు వేస్తారనుకుంటున్నా. ఇప్పటివరకూ మా నాన్న 800 మంది ఆర్టిస్ట్‌లకు ఫోన్‌ చేసి..  మీ సహకారం కావాలి అని కోరగా వాళ్లందరూ చాలా బాగా రెస్పాండ్‌ అయ్యారు’ అని విష్ణు వివరించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని