TS News: ఏడేళ్లలో తెలంగాణకు 15వేలకు పైగా పరిశ్రమలు: కేటీఆర్‌  - telugu news premium enegies new plant started in ecity in maheswaram
close
Updated : 29/07/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ఏడేళ్లలో తెలంగాణకు 15వేలకు పైగా పరిశ్రమలు: కేటీఆర్‌ 

ఈ- సిటీలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ నూతన ప్లాంట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: మహేశ్వరంలో ఉన్న ఈ-సిటీలో ప్రముఖ సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్‌ను ప్రారంభించింది. రూ.483 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టు(సరికొత్త ప్రాజెక్టు) ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రెండేళ్లలో పెట్టుబడులను రూ.1200 కోట్లకు పెంచనున్నట్లు తెలిపింది. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. గడిచిన ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం 15 వేల పైచిలుకు పరిశ్రమలను.. తద్వారా 2లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులను సాధించుకుందని కేటీఆర్‌ అన్నారు. ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణమన్నారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని వివరించారు.

ఆగస్టు 5వ తేదీన స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కిల్‌ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తామని కేటీఆర్‌ అన్నారు. రావిర్యాల, మహేశ్వరం, తుక్కుగూడ ప్రజలకు నైపుణ్యంతో పాటు ఉపాధికీ అవకాశాలు కల్పిస్తామన్నారు. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక శక్తికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు.

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని కేటీఆర్‌ చెప్పారు. 2023 కల్లా 4 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యుల్స్, సోలార్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ ప్రణాళికలున్నాయి. ఈ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని