PV Sindhu: సింధు.. ప్రధానితో కలిసి కచ్చితంగా ఐస్‌క్రీం తింటుంది! - telugu news pv sindhus father says she will now have ice cream with pm modi
close
Updated : 02/08/2021 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PV Sindhu: సింధు.. ప్రధానితో కలిసి కచ్చితంగా ఐస్‌క్రీం తింటుంది!

తండ్రి పీవీ రమణ సంతోషం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన పీవీ సింధుపై ఆమె తండ్రి పీవీ రమణ ప్రశంసల జల్లు కురిపించారు. కాంస్యం గెలిచిన తన కుమార్తె ఇక ప్రధాని మోదీతో కలిసి ఐస్‌క్రీం తింటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చైనా అమ్మాయి బింగ్జియావోపై ఆమె తిరుగులేని విజయం అందుకుంది. స్వర్ణపోరుకు అర్హత సాధించనప్పటికీ కాంస్యం గెలిచి మురిపించింది. కాగా సింధుకు ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. బ్యాడ్మింటన్‌ కోసం ఆమె దానిని త్యాగం చేసింది. టోక్యో వెళ్లేముందు సింధును ప్రోత్సహించేందుకు.. గెలిచి రాగానే ఐస్‌క్రీం తిందామని ప్రధాని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ ఆమెకిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ‘నువ్వు వెళ్లు.. రాగానే మనిద్దరం కలిసి ఐస్‌క్రీం తిందాం’ అని ఆయన అన్నారు. ఇప్పుడు సింధు రాగానే ప్రధానిని కలిసి కచ్చితంగా ఐస్‌క్రీం సేవిస్తుంది’’ అని పీవీ రమణ అన్నారు.

‘‘వరుసగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచినందుకు సంతోషంగా ఉంది. ఈ దేశానికి పేరు, కీర్తిప్రతిష్ఠలను ఆమె తీసుకొచ్చింది. ఆమెకు లక్ష్యంపై దృష్టి ఉంది. తనలో కసి ఉంది. ఆటను ఆస్వాదిస్తుంది. ఆమె ఎప్పుడు ఒలింపిక్స్‌కు వెళ్లినా పతకం తీసుకొచ్చింది. గతసారి రజతం గెలిచింది. ఈ సారి కాంస్యం కైవసం చేసుకుంది’’ అని రమణ ఆనందం వ్యక్తం చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని