పుట్టినరోజు వేడుకకు పిలిచి అత్యాచారం.. మహిళా కానిస్టేబుల్‌పై దారుణం - telugu news rape on a lady constable in madhyapradesh
close
Updated : 26/09/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుట్టినరోజు వేడుకకు పిలిచి అత్యాచారం.. మహిళా కానిస్టేబుల్‌పై దారుణం

నీమచ్‌: మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీసి బెదిరింపులకు దిగారు. ఈ నెల మొదటి వారంలో చోటుచేసుకున్న దారుణానికి సంబంధించి బాధితురాలు సెప్టెంబరు 13న ఫిర్యాదు చేసినట్లు పోలీసులు శనివారం చెప్పారు. ఐదుగురిపై కేసు నమోదుచేశామని, ప్రధాన నిందితుడు, అతని తల్లిని అరెస్టు చేశామని తెలిపారు. ‘‘ప్రధాన నిందితుడు ఫేస్‌బుక్‌ వేదికగా బాధితురాలితో స్నేహం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వాట్సప్‌లో సంప్రదింపులు జరిపాడు. ఈ క్రమంలో తన తమ్ముడి పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు కానిస్టేబుల్‌పై అత్యాచారం చేశారు’’ అని వివరించారు. ప్రధాన నిందితుడు, అతని సోదరుడు, వేడుకకు హాజరైన మరో వ్యక్తి తనపై దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. అత్యాచారం తర్వాత ప్రధాన నిందితుడి తల్లి, మరొకరు చంపేస్తామని బెదిరించారని, డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారని బాధితురాలు వాపోయారని తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని