ఒక్క రాత్రిలో సాగే ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’.. ఓటీటీలోకి సునీల్‌ కొత్త చిత్రం  - telugu news sunil heads and tales movie on ott
close
Published : 09/10/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క రాత్రిలో సాగే ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’.. ఓటీటీలోకి సునీల్‌ కొత్త చిత్రం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సునీల్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా కథానాయిక రెజీనా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ప్రతి మహిళకూ స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం పోరాడాలని సూచిస్తుంది. యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులూ చూడాల్సిన సినిమా ఇది’ అని చిత్ర బృందం తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని