Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో హిట్‌/ఫ్లాప్‌ అయ్యేదెవరో చెప్పేసిన శ్వేత - telugu news sweta interview after elimination from bigg boss house
close
Published : 20/10/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో హిట్‌/ఫ్లాప్‌ అయ్యేదెవరో చెప్పేసిన శ్వేత

హైదరాబాద్‌: ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌లో తాను అర్హత కోల్పోయి ఉండకపోతే వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ అయ్యేదాన్ని కాదని, అదే సమయంలో కచ్చితంగా కెప్టెన్‌ అయ్యేదాన్నని ఆరో వారం ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిన శ్వేత వర్మ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాన్ని చెప్పింది. నామినేషన్స్‌ జరిగే ముందే ఎవరిని నామినేట్‌ చేయాలనే స్పష్టత ఇంట్లో వాళ్లకు లేదని తెలిపింది. ‘నువ్వు నన్ను నామినేట్‌ చేశావ్‌.. కాబట్టి, నేను నిన్ను నామినేట్‌ చేస్తా’ అని అందరూ చెప్పడం బాగోలేదని అభిప్రాయపడింది. 

ఇక హౌస్‌మేట్స్‌లో ఎవరు హిట్‌.. ఎవరు ఫ్లాప్‌? అని అడగ్గా ఒక్కో కంటెస్టెంట్‌ గురించి ఇలా చెప్పుకొచ్చింది శ్వేత.

సన్నీ-హిట్‌: బాగా ఫన్నీగా ఉంటాడు. టాస్క్‌లో అగ్రెసివ్‌గా ఆడతాడు. రెండు, మూడు సార్లు నామినేషన్స్‌లో ఉండి కూడా బయటకు వచ్చాడు.

సిరి-ఫ్లాప్‌: వ్యక్తిగా మంచి అమ్మాయి. అయితే ఇప్పటివరకూ హౌస్‌లో ఎప్పుడూ ఒంటరిగా ఆడటం చూడలేదు. గ్రూపులతో కలిసి ఉంటుంది.

రవి-ఫ్లాప్‌: చాలా స్మార్ట్‌. రవి గేమ్‌ ఆడటానికి వచ్చాడు. బంధాలు ఏర్పాటు చేసుకోవటానికి రాలేదు. మాటలు మారుస్తాడు. ఏ మనిషితో ఎంతలా ఉండాలో అంతలా ఉంటాడు. అతనిది మైండ్‌ గేమ్‌. కంటెస్టెంట్లను ప్రభావితం చేస్తాడు.

శ్వేత-హిట్‌: బిగ్‌బాస్‌ జర్నీలో నాతో నేను ఉన్నా. సేఫ్‌గా గేమ్‌ ఆడలేదు. ఎవరి మీదా బ్యాడ్‌ ఒపినీయన్‌ లేదు.

ఉమ- ఫ్లాప్‌: ఉమది స్వచ్ఛమైన మనసు. అయితే ఆమె ఉన్నన్ని రోజులు అనవసర మాటలు మాట్లాడారు. ఆమె అలాంటి భాష ఉపయోగించి ఉండకూడదు.

కాజల్‌-హిట్‌: ఇంట్లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ఆమెపై నాకు మంచి అభిప్రాయం ఉంది. కాజల్‌ అనుకున్న పరిస్థితులు హైలైట్‌ అవుతాయి.

విశ్వ-హిట్‌: ప్రతి టాస్క్‌లో 100శాతం ప్రయత్నిస్తాడు. బాగా ఎమోషనల్‌. అదే అతడికి మైనస్‌.

నటరాజ్‌ మాస్టర్‌-ఫ్లాప్‌: నటరాజ్‌ మాస్టర్‌ ఆయనలా ఉండి ఉంటే ఇంకా ఇంట్లో ఉండేవారు.

మానస్‌-హిట్‌: మొదటి వారం ఎవరితోనూ మాట్లాడలేడు అనుకున్నాం. ఆరో వారానికి అసలు నామినేషన్‌ ప్రక్రియలోకే రాలేదు. ప్రతి టాస్క్‌లో బాగా ఆడాడు. తనవైపు తప్పు జరిగితే, వెనక్కి రాగలడు. చాలా విషయాలు అతడికి నచ్చవు. కానీ, కంట్రోల్‌ చేసుకుంటాడు.

సరయు-ఫ్లాప్‌: వారం రోజులు ఆమె అడ్జెస్ట్‌ అవటానికే అయిపోయింది. ఒకవేళ ఉండి ఉంటే, బాగుండేది.

హమీదా-ఫ్లాప్‌: హమీదా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. నామినేషన్స్‌/వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ సమాయానికి సేఫ్‌ గేమ్‌ ఆడుతుంది.

ప్రియాంక-హిట్‌: ప్రియాంక కామెడీ బాగా చేస్తుంది. తనకు నచ్చినట్లు ఉంటుంది. నామినేషన్స్‌లో నువ్వు బాగా ఆడాలని ఒకట్రెండు సార్లు చెప్పాను. అప్పటి నుంచి మారిపోయింది. మానస్‌తో ఎక్కువ సమయం గడుపుతోందని అనుకుంటున్నా.

ప్రియ-ఫ్లాప్‌: ‘మెన్స్‌తో ఎక్కువ సేపు ఉంటుంది’ అని లహరిని అలా అనడం బాగోలేదు. మాటలు మారుస్తారు.

జెస్సీ-హిట్‌: ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇస్తాడు. తనకు నచ్చినట్లు ఉంటాడు. ఎక్కడా సేఫ్‌గా ఆడడు. ప్రతిదీ ఫన్‌గా చెబుతాడు. బెస్ట్‌ ఫ్రెండ్‌.

షణ్ముఖ్‌-హిట్‌: మొదటి వారంతో పోలిస్తే బాగా ఆడుతున్నాడు.

అనీ మాస్టర్‌-హిట్‌: వ్యక్తిగా ఆమె చాలా స్ట్రాంగ్‌. ఎవరితో మాట్లాడాలన్నా చాలా నిజాయతీగా ఉంటారు.

లహరి-హిట్‌: నా వరకూ హిట్‌. చాలా పరిణతితో వ్యవహరించింది.

లోబో-ఫ్లాప్‌: ఇప్పటివరకూ సరిగా ఆడటంలేదు. రవి మాటలు వింటున్నాడు. వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలు తీసుకోలేడు.

శ్రీరామ్‌-హిట్‌: మంచి అబ్బాయి. తప్పుగా అర్థం చేసుకుంటారు. అందరినీ పొగుడుతూ ఉంటాడు. హమీదా వెళ్లిపోయిన తర్వాత యాక్టివ్‌గా లేడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని