India Vaccination: ఈ వేగం కొనసాగితే.. డిసెంబర్ నాటికి 43% మందికి టీకా..! - telugu news union health minister mansukh mandaviya on 75 crore doses milestone
close
Published : 14/09/2021 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India Vaccination: ఈ వేగం కొనసాగితే.. డిసెంబర్ నాటికి 43% మందికి టీకా..!

దిల్లీ: దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. జనవరిలో ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 75 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఇదే వేగంతో పంపిణీ కొనసాగితే.. డిసెంబర్‌ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి టీకాలు అందుతాయని  ఆశాభావం వ్యక్తం చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. 75 కోట్ల మైలురాయిని చేరుకోవడంపై మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

‘భారత్‌కు నా అభినందనలు! ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ టీకా పంపిణీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. దేశంలో 75 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి’ అని మాండవీయ ట్వీట్ చేశారు.

మూడోముప్పు ఆందోళనల మధ్య కరోనాను ఎదుర్కోవాలంటే డిసెంబర్ నాటికి 60 శాతం దేశ జనాభాకు రెండు డోసులు అందాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ లక్ష్యాన్ని చేరాలంటే భారత్ రోజుకు 1.2 కోట్ల మందికి టీకా వేయాల్సి ఉంది. మరోపక్క ఈ ఏడాది చివరి నాటికి 200 కోట్ల డోసులు పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. వారం రోజులుగా సగటున రోజుకు 70 లక్షలకు పైగా డోసులు పంపిణీ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.3 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.4లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని