Vishwaksen: సినిమా విడుదలకు కొన్నిగంటల ముందు సినీప్రియులకు విశ్వక్‌ లేఖ - telugu news vishwaksen writtes a letter to cini lovers
close
Published : 14/08/2021 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishwaksen: సినిమా విడుదలకు కొన్నిగంటల ముందు సినీప్రియులకు విశ్వక్‌ లేఖ

ఎలాంటి సినీనేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చా..

హైదరాబాద్‌: నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన నాటి నుంచి మాస్‌ సినిమాల్లో నటిస్తూ ‘మాస్‌ కా బాప్‌’గా పేరు తెచ్చుకున్నారు విశ్వక్‌సేన్. మొదటిసారి ఆయన పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్రలో నటించిన చిత్రం ‘పాగల్‌’. శనివారం (ఆగస్టు 14) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం అర్ధరాత్రి సినీ ప్రియులను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశారు. తమ ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే విమర్శించమని తెలిపారు. సినిమా థియేటర్స్‌ని కాపాడమని పేర్కొన్నారు.

‘నన్ను ఇంతగా సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. ఇప్పుడు నేను నటించిన ‘పాగల్‌’ సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్‌ వేవ్‌ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి ఉన్నా లేకపోయినా ఎన్నో వేల మందికి ఉపాధి కలిగించే సినిమా థియేటర్స్‌ని కాపాడండి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..!’ అని విశ్వక్‌ చెప్పుకొచ్చారు.

నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ‘పాగల్‌’లో విశ్వక్‌.. ప్రేమ్‌ అనే కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు. చనిపోయిన తన తల్లి ప్రేమను పంచే అమ్మాయి కోసం వెతికే అబ్బాయిగా ఆయన పాత్ర ఉంటుంది. సిమ్రన్‌, నివేదా పేతురాజు కథానాయికలు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌, లక్కీ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రాహుల్‌ రామకృష్ణ, మహేశ్‌, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని