కరోనాతో టాలీవుడ్‌ దర్శకుడు మృతి - tollywood director dies due to covid19
close
Updated : 26/04/2021 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో టాలీవుడ్‌ దర్శకుడు మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినీ దర్శకుడు, రచయిత సాయి బాలాజీ ప్రసాద్‌(57) కరోనాతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్‌ తమ్ముడు’ వంటి చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ వంటి ధారావాహికలకూ దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు రచయితగా.. మరికొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లే బాధ్యతలు నిర్వర్తించారు. ‘బావగారూ బాగున్నారా!’ చిత్రానికి పనిచేసిన స్క్రీన్‌ప్లే బృందంలో ఆయన ఒకరు. తిరుపతికి చెందిన ప్రసాద్‌.. రవిరాజా పినిశెట్టి దగ్గర దర్శకత్వ మెళుకువలు నేర్చుకున్నారు. ఆయనకు భార్య గౌరి, కుమార్తె స్నేహపూజిత ఉన్నారు. ఆయన మరణంపై సినిమా, టీవీ రంగాలకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని