టీకా తీసుకుంటే టమోటాలు ఫ్రీ.. - tomatoes giving to corona vaccination people initiative of bijapur muncipality
close
Updated : 21/04/2021 05:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా తీసుకుంటే టమోటాలు ఫ్రీ..

బీజాపూర్‌: కరోనా టీకా వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని జీజాపూర్‌ పురపాలక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టీకా వేసుకున్న వారందరికీ టమోటాలు ఉచితంగా ఇస్తోంది. కరోనా టీకా తీసుకున్న వారందరికీ టమోటాలను అందిస్తున్నామని బీజాపూర్‌ మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని.. రైతుల నుంచి టమోటాలు సేకరించి వాటిని టీకా వేసుకున్న వారికి పంచుతున్నామని వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 13834 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధికంగా 175 మంది మృత్యువాత పడగా, ఇప్పటివరకు మొత్తంగా 6083 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని