Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 11/08/2021 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Huzurabad By Election: హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి ఖరారు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తెరాస అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేసింది. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. శ్రీనివాస్‌ యాదవ్‌ స్వస్థలం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ శాసనసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Parliament: రాజ్యసభలో కంటతడి పెట్టిన వెంకయ్యనాయుడు

రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తనపై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలో అలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య ప్రసంగిస్తూ.. ‘‘ప్రజాస్వామ్యానికి పార్లమెంట్‌ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. కానీ కొందరు సభ్యులు సభలో అమర్యాదగా ప్రవరించారు. టేబుళ్లపై కూర్చున్నారు. కొందరు టేబుళ్లపై నిల్చున్నారు’’ అంటూ తీవ్రంగా కలత చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Hyderabad News: గచ్చిబౌలిలో ప్రమాదం.. రోలింగ్‌ షట్టర్‌లో పడి బాలుడి మృతి

ఆటోమేటిక్‌ రోలింగ్‌ షట్టర్‌లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా అలమూరు గ్రామానికి చెందిన అర్జున్‌, దేవి దంపతులు వారి కుమారులు రాజేశ్‌ (10), భాను ప్రకాశ్‌లతో కలిసి ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం నగరానికి వచ్చారు. అర్జున్‌.. గచ్చిబౌలి అంజయ్య నగర్‌ కేఎన్‌ఆర్‌ స్వ్కేర్‌ భవనంలో సెక్యురిటీ గార్డుగా చేరాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Crime News: పొట్టలో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌

4. Tina Dabi - Athar Aamir Khan: ఆ ఐఏఎస్‌ టాపర్స్‌ జంట విడిపోయింది..!

ఐఏఎస్‌ టాపర్స్‌ జంట టీనా దాబి, అధర్‌ ఆమిర్‌ ఖాన్‌ విడిపోయారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల ఫ్యామిలీ కోర్టు వీరికి తాజాగా విడాకులు మంజూరు చేసింది. ఐఏఎస్‌ పరీక్షలో ఒకటి, రెండు ర్యాంకులు సాధించిన వీరిద్దరూ 2018లో వివాహబంధంతో ఒక్కటై వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లకే వీరిమధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గతేడాది నవంబరులో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు విడాకులు మంజూరయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Google: ఇంటి నుంచే పనిచేస్తుంటే.. గూగుల్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత!

గూగుల్‌ ఉద్యోగుల్లో శాశ్వతంగా ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని ఎంచుకున్న వారికి వేతనాలు తగ్గనున్నాయి. కంపెనీ జూన్‌లో తీసుకొచ్చిన ‘వర్క్‌ లొకేషన్‌ టూల్‌’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. సిలికాన్‌ వ్యాలీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియను ఇతర పెద్ద కంపెనీలూ పాటిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్‌లు సైతం తక్కువ వ్యయాలుండే ప్రాంతాలకు మారిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. రెడిట్, జిల్లో వంటి చిన్న కంపెనీలు కూడా ప్రాంతం ఆధారిత చెల్లింపుల నమూనాకు మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Ravi Shastri ready to say goodbye: రవిశాస్త్రి గుడ్‌బై.. బీసీసీఐకి విషయం చేప్పేశాడని వార్తలు!

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపిక లాంఛనమేనా? టీ20 ప్రపంచకప్‌ తర్వాత రవిశాస్త్రి వెళ్లిపోవడం ఖాయమేనా? అతడు ఈ పాటికే బీసీసీఐకి తన నిర్ణయం చెప్పేశాడా? గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి! భారత క్రికెట్‌ జట్టు కోచింగ్‌ బృందంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక టీమ్‌ఇండియా కోచ్‌ పదవికి గుడ్‌బై చెప్పేస్తానని రవిశాస్త్రి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Sunitha: డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానన్నారు.. ఆమె మాటతో బాగా ఏడ్చాను

తన మధురమైన స్వరంతో గాయకురాలిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి చేరువైన తెలుగింటి ముద్దుగుమ్మ సునీత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల రామ్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bombay High Court: వివాహితకు ప్రేమలేఖ.. ముమ్మాటికీ తప్పే

‘ఓ మహిళకు సచ్ఛీలతే విలువైన ఆభరణం. ప్రేమ పేరుతో వివాహితకు లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లే’ అని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలా చేయడం ఆమె నిబద్ధతను శంకించడమేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టులోని నాగ్‌పుర్‌ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వివాహితకు ప్రేమలేఖ పంపిన వ్యక్తికి రూ.90 వేల జరిమానా విధించి.. అందులో రూ.85 వేలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. విషయం పూర్వాపరాల్లోకి వెళితే.. 2011లో ఓ కిరాణం షాపు యజమాని అక్కడ పనిచేసే వివాహితకు ప్రేమలేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అపరిచితుల వాట్సప్‌ గ్రూపులో చేరకుండా..

మనకు తెలియకుండా, మన అనుమతి లేకుండా వాట్సప్‌ గ్రూప్‌లో మన కాంటాక్ట్‌ నంబర్‌ను జోడిస్తే? అది మనకు ఇష్టంలేని విషయాలను చర్చించే వేదికైతే? ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. మరెలా?మన వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి వాట్సప్‌లో ఎన్నో సెటింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రొఫైల్‌ ఫొటోలు, చివరిసారి చూసిన స్టేటస్‌ కనిపించకుండా చేయటం వంటివన్నీ ఇలాంటివే. గ్రూపుల విషయంలోనూ ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఎవరైనా ఎవరినైనా ఏ గ్రూపులోనైనా చేర్చే అవకాశం లేకపోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Donkey milk: గాడిద పాలు లీటరు రూ.10వేలు

10. Corona: దేశంలో 38వేల కొత్త కేసులు.. 55 శాతం ఒక్క కేరళలోనే..!

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ఎప్పటిలాగే మంగళవారం కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కన్పించగా.. బుధవారం మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా కేసులు మళ్లీ 40వేలకు చేరువకాగా.. దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుండడం కాస్త ఊరటనిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని