Nokia Smartphones: నోకియా నుంచి మరో రెండు చౌక ఫోన్లు  - two new budget smartphones nokia g10 nokia c01 plus launched in india
close
Published : 15/09/2021 23:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nokia Smartphones: నోకియా నుంచి మరో రెండు చౌక ఫోన్లు 

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ కంపెనీ నోకియా మొబైల్ శ్రేణిలో మరో రెండు చౌక ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా జీ10, నోకియా సీ01 ప్లస్‌ పేరుతో వీటిని పరిచయం చేసింది. నోకియా సీ01ను ఎంట్రీ లెవల్ శ్రేణిలో, నోకియా జీ10 బడ్జెట్‌ శ్రేణిలో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు.. ధరెంత.. ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయనేది చూద్దాం.


నోకియా జీ10

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. వెనుకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. వీటిలో నైట్‌ మోడ్‌, పొట్రైయిట్ మోడ్, ఏఐ కెమెరా వంటి ఫీచర్స్‌ ఇస్తున్నారు. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12, 149. నైట్, డస్క్ రంగుల్లో లభిస్తుంది. నోకియా, అమెజాన్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. 


నోకియా సీ01 ప్లస్‌

నోకియా సీ01 ప్లస్‌లో ఆక్టాకోర్ యూనిసాక్‌ ఎస్‌సీ9863ఏ 1.6 గిగాహెర్జ్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో వెనుకవైపు 5 ఎంపీ హెచ్‌డీఆర్‌ కెమెరా, ముందుభాగంలో 2 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 5 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 2 జీబీ ర్యామ్‌/16 జీబీ అంతర్గత స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 5,999. నోకియా, అమెజాన్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. బ్లూ, గ్రే రంగుల్లో లభిస్తుంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని