‘ఉప్పెన’ డైరెక్టర్‌కు ఖరీదైన కానుక - uppena director buchibabusana is now a proud owner of the luxurious benz
close
Updated : 26/03/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ డైరెక్టర్‌కు ఖరీదైన కానుక

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన డైరెక్టర్‌ బుచ్చిబాబును ఓ ఖరీదైన కానుక వరించింది. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ విజయంతో ఇప్పటికే వరుస సినిమా ఆఫర్లతో సంతోషంలో మునిగి తేలుతున్న బుచ్చిబాబు ఖాతాలో మరో కానుక వచ్చి చేరింది. తమకు కలెక్షన్ల వర్షం కురిపించే సినిమా తీసినందుకు గాను.. సదరు చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఒక బెంజ్‌ కారును బుచ్చిబాబుకు కానుకగా పంపించింది. ఆ కారు విలువ దాదాపు రూ.75లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ స్వయంగా బుచ్చిబాబుకు కారు అందజేసి అభినందించారు. కాగా.. తనకు కానుక అందిన ఆ కారులో మొదటగా తన గురువు సుకుమార్‌ను ఎక్కించుకొని బుచ్చిబాబు ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు.. హీరో వైష్ణవ్‌ తేజ్‌కు రూ.కోటి, హీరోయిన్‌ కృతిశెట్టికి రూ.25లక్షలు అదనంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, బుచ్చిబాబుతో మరో రెండు సినిమాలు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని