Joe Biden: కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్న జో బైడెన్ - us president joe biden gets covid 19 booster shot
close
Updated : 28/09/2021 23:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 Joe Biden: కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్న జో బైడెన్

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి మూడో డోసును అమెరికా సీడీసీ, ఎఫ్‌డీఏ సిఫారసు చేసిన మరుసటి రోజే ఆయన ఫైజర్ మూడో డోసు తీసుకున్నారు. తన భార్య జిల్ బైడెన్  కూడా బూస్టర్ డోసు తీసుకున్నట్లు బైడెన్  తెలిపారు. టీకా వల్ల తమకు ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా అందరూ కచ్చితంగా టీకా వేసుకోవాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. కాగా అమెరికాలో కరోనా డెల్టా వేరియంట్ కారణంగా కొవిడ్ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న వారు బూస్టర్ డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని బైడెన్ సూచించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని