close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120085735 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 8HA1HRufYso [video_short_link] => 8HA1HRufYso [created_by] => [created_date] => [modified_by] => 1071079 [modified_date] => 2020-07-16 13:27:39.046951 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 16/07/2020 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గణితంతో కుస్తీ కాదు.. దోస్తీ చేయండి

విద్యాబాలన్‌ ‘శకుంతల దేవి’ ట్రైలర్‌ విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: శకుంతల దేవి అనగానే ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ అని ఠక్కున చెప్పేస్తుంది పాత తరం. అంతగా ఆమె పేరు మార్మోగిపోయింది. కంప్యూటర్లకు సరిసమానంగా, ఒక్కోసారి వాటి కంటే వేగంగా గణితంలోని చిక్కు ప్రశ్నలను సైతం పరిష్కరించేవారు. గణితంలో ఎలా అయితే చిక్కుముళ్లు ఉన్నాయో శకుంతల దేవీ జీవితంలోనూ ఉన్నాయి. అవేంటో మీకు చెప్పడానికే ‘శకుంతల దేవి’గా  విద్యాబాలన్‌ వస్తున్నారు. ఈ నెల 31న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా వెండితెరపైనే విడుదల కావాల్సి ఉన్నా... కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ బాట పట్టింది.  ఈ సినిమా విడుదల నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

నిండా మనుషులు... వారి చప్పట్ల మధ్య శకుంతల దేవి ఆడిటోరియంలోకి ప్రవేశిస్తున్న దృశ్యంతో మొదలైన ట్రైలర్‌లో ‘నాన్న నేను స్కూల్‌కి వెళ్దాం అనుకుంటున్నా... అని చిన్ననాటి శకుంతలదేవి తన తండ్రిని అడిగితే... స్కూల్‌లో నువ్వేం నేర్చుకుంటావు. తిరిగి స్కూల్‌కే నేర్పిస్తావు’ అంటూ శకుంతల చిన్నతనంలో చదువు విషయంలో ఎంత చురుకుగా ఉండేవారో చెప్పారు. ఆ తర్వాత ప్రతి గణిత ప్రశ్నకు ఆమె ఠక్కున సమాధానం చెప్పేయడం.. ఎలా చెప్పావు అంటే... ‘అవును ఎలా’ అని ఆశ్చర్యపోతూ అనడం ఆమె ఎంత సరదాగా, చురుకుగా ఉండేవారో సూచిస్తుంది. మధ్యలో ఆమె ప్రేమ కథ, కోపం, కష్టం, కుటుంబ బంధాలు ఇలా చాలా సన్నివేశాలు అలా వచ్చి ఇలా మాంటేజ్‌ షాట్స్‌గా వెళ్తాయి. ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ వెనుక ఉన్న ఆ సంగతుల్ని పూర్తిగా తెలుసుకోవాలంటే 31న అమెజాన్‌ ప్రైమ్‌లో చూడల్సిందే. 

అను మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ హిందీ సినిమాలో సన్యా మల్హోత్రా, అమిత్‌ సాధ్‌, జిస్సూ సేన్‌ గుప్తా తదితరులు నటించారు. సోనీ పిక్చర్స్‌, విక్రమ్‌ మల్హోత్రా కలసి నిర్మించారు. అను మేనన్‌, నయనిక మహతానీ కథ, కథనం అందించారు. సచిన్‌ - జిగార్‌ సంగీతమందించారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.