వెట్రిమారన్‌ దర్శకత్వంలో.. - vijay new movie with vetrimaran
close
Updated : 29/03/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెట్రిమారన్‌ దర్శకత్వంలో..

‘ఆడుగలం’, ‘అసురన్‌’ చిత్రాలతో జాతీయ స్థాయిలో మెరిసిన దర్శకుడు వెట్రి మారన్‌. ఆయన తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ దళపతితో ఓ చిత్రం చేయనున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ క్రేజీ కలయికలోనే ‘విజయ్‌ 65’ పట్టాలెక్కుతుందని భావించినా.. ఆఖరి నిమిషంలో ఆ అవకాశం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కి దక్కింది. దీంతో వెట్రి - విజయ్‌ల కాంబినేషన్‌ లేనట్లే అనుకున్నారు. అయితే త్వరలోనే వీరిద్దరి కలయికలో ఓ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కథ సిద్ధమైంది.

నిజానికి గతంలోనే ఈ కథ విజయ్‌కి వినిపించారని, అది ఆయనకి నచ్చడంతో ‘విజయ్‌ 65’గా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించారు. కానీ, వెట్రి మారన్‌ ముందుగా ఒప్పుకొన్న సినిమాల వల్ల ఇది ఆలస్యమైంది. ఇప్పుడా సినిమాలన్నీ పూర్తి చేసి, విజయ్‌ కోసం వేచి చూసేందుకు సిద్ధమవుతున్నారు వెట్రి మారన్‌. విజయ్‌ కూడా నెల్సన్‌ సినిమా పూర్తి చేసి, ఆయనతో చేతులు కలిపేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాదిలోనే వీరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని