Vladimir Putin: పచ్చిక బయళ్లలో తిరుగుతూ చేపలు పట్టిన రష్యా అధ్యక్షుడు‌! - vladimir putin fishing hiking in siberia after self-isolation over covid scare
close
Updated : 27/09/2021 05:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vladimir Putin: పచ్చిక బయళ్లలో తిరుగుతూ చేపలు పట్టిన రష్యా అధ్యక్షుడు‌!

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరివారంలో కొందరికి కరోనా సోకడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, స్వీయ నిర్బంధం ముగిసిన తర్వాత ఆయన సైబీరియాలో చాలా రోజులు సెలవుల్లో గడిపారు. అక్కడే పచ్చిక బయళ్లలో ఓ సాధారణ పౌరుడిలా తిరుగుతూ చేపలు పట్టారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ వెల్లడించింది.

‘సెప్టెంబరు మధ్యలో తన పరివారంలోని చాలా మందికి కొవిడ్‌ సోకింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అది పూర్తయిన తర్వాత పుతిన్‌ సైబీరియాలో కొన్ని రోజులు గడిపారు’ అని క్రెమ్లిన్‌ పేర్కొంది. తాజాగా పుతిన్ సైబీరియాలోని తిరుగుతూ ఒక నదిలో చేపలు పట్టిన ఫొటోలను క్రెమ్లిన్‌ విడుదల చేసింది. ఇందులో తనతో పాటు రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పుతిన్‌ గతంలో కళ్ల జోడు పెట్టుకొని గుర్రపు స్వారీ చేయడం, వేటకు రైఫిల్‌ను తీసుకెళ్లడం, ఫైటర్ జెట్‌ను నడపడం వంటి చిత్రాలు ఎందర్నో ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు అతని విహారయాత్రలో సాధారణంగా గడిపిన చిత్రాలను చూసి రష్యన్లతోపాటు నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని