కాజల్‌ వివాహం.. 35 రోజుల సమయం: అంబికా - wedding planner ambika about kajal
close
Published : 22/04/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాజల్‌ వివాహం.. 35 రోజుల సమయం: అంబికా

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెండితెర ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌ గతేడాది అక్టోబరులో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిమంది అతిథుల సమక్షంలో గౌతమ్‌ కిచ్లుని వివాహమాడింది ఈ ముద్దుగుమ్మ. కల్యాణ వేదిక, ఈ జంట ధరించిన వస్త్రాలు ప్రతి ఒక్కరినీ ఆకర్షించాయి. నెట్టింట వైరల్‌ అయ్యాయి. అంతలా ఆకర్షించడానికి కారణం ఎవరో తెలుసా? ప్రముఖ వెడ్డింగ్‌ ప్లానర్‌ అంబికా గుప్త. ఇటీవలే ఆమె ఓ న్యూస్‌ పోర్టల్‌ ప్రారంభించి కాజల్‌ వ్యక్తిత్వం, పెళ్లి విశేషాలు పంచుకుంది. 

‘కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ సెలబ్రిటీలా వ్యవహరించలేదు. తనెంత పెద్ద స్టార్‌ అయినా అందరితోనూ వినయంగా ఉంటుంది. ఒదిగి ఉండే మనస్తత్వం తనది. తన పెళ్లి అంగరంగవైభవంగా జరిగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. పంజాబ్‌, కశ్మీర్‌ ఆచారాల ప్రకారం సాగింది ఆమె కల్యాణం. ముఖ్యంగా పెళ్లి మండపం కశ్మీర్‌ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఏర్పాట్లు చేసేందుకు 35 రోజుల సమయం పట్టింది’ అని తెలిపారు అంబికా. సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటిస్తోంది కాజల్‌. నాగార్జున- ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాతోనూ సందడి చేయనుంది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని