ఎఫ్‌3: ఇక వరుణ్‌ వంతు - welcome back to the world of fun and frustration mega prince
close
Published : 12/01/2021 06:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎఫ్‌3: ఇక వరుణ్‌ వంతు

హైదరాబాద్‌: మెగా హీరో‌ వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌3’ సెట్‌లో కాలుపెట్టారు. ఇటీవల వరుణ్‌ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘ఎఫ్‌3’ సెట్‌కు చేరుకొని చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్వయంగా ట్విటర్‌లో పంచుకున్నారు. ‘సెట్లోనూ సందడి మొదలు కాబోతోంది’ అని ఆయన రాసుకొచ్చారు. ఇటీవల వెంకీమామపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా.. వరుణ్‌ కూడా రావడంతో సినిమా షూటింగ్‌ వేగం పుంజుకోనుంది.

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో అనిల్‌ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్‌2’ సందడి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ ఇద్దరికీ జోడీగా తమన్నా, మెహరీన్‌ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

ఇదీ చదవండి

టీజర్‌లాగే సినిమా కూడా నచ్చుతుందిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని