మంచి ఆరోగ్యానికి.. కాజోల్ పంచ సూత్రాలు - world health day 2021 cinema celebriteis messeges
close
Published : 07/04/2021 23:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచి ఆరోగ్యానికి.. కాజోల్ పంచ సూత్రాలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సినీతారల పిలుపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో సినీ తారలు ఎప్పుడూ ముందుంటారు. వాళ్లు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండేందుకు నిత్యం శ్రమిస్తుంటారు. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు దానిపై ఇతరులకూ అవగాహన కల్పించాలని పలువురు సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు సూచించారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జునతో మొదలుకొని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ల వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులను కోరారు. మంచి ఆరోగ్యానికి పంచ సూత్రాలు పాటించాలంటూ బాలీవుడ్‌ నటి కాజోల్‌ ఒక పోస్టు చేసింది.

ఈ కరోనా కష్టకాలంలో మంచి ఆరోగ్యానికి పంచ సూత్రాలు.. 1. చేతులను లోపలికి లాగండి 2. కారు విండో మూసేయండి 3.కారు స్టార్ట్‌ చేయండి 4.ఇంటికి వెళ్లండి 5.బయటికి వెళ్లవద్దు  - కాజోల్‌
కరోనా కష్టకాలంలో మీరు, మీతోపాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు పాటించండి - నాగార్జున

* ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. అందరం సమష్టిగా ఈ ప్రపంచానికి అవగాహన కల్పిద్దాం. అవసరమైన ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు కలిసి పోరాడుదాం - మంచు లక్ష్మి

మనం మన శరీరాలను లోతుగా అర్థం చేసుకొంటూ.. మన ఆరోగ్యానికి విలువను పెంచినప్పుడే ఈ భూమ్మీద మరింత దృఢంగా ఉండగలం   - సమంత

* మనం బయటికి ఆరోగ్యంగా కనిపించాలంటే అది లోపలి నుంచే ప్రారంభం కావాలి. వ్యాయామం చేయడం, సన్నగా కనిపించడం మాత్రమే ఆరోగ్యం కాదు. మనల్ని మనం ఆస్వాదిస్తూ.. ఆత్మవిశ్వాసంతో బతకాలి - రకుల్‌ప్రీత్‌సింగ్‌

ఎవరూ పెద్దగా పట్టించుకోని ఒక అద్భుతమైన ప్రక్రియే శ్వాస  - రాశీఖన్నా

* ఆరోగ్యం ఒక గొప్ప కానుక - వరుణ్‌తేజ్

* నేను బయటకి వచ్చిన ప్రతిసారీ కచ్చితంగా మాస్కు పెట్టుకుంటాను. మీరు కూడా దయచేసి మాస్కు పెట్టుకోండి. ఇంట్లోనే ఉండండి. మీ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోండి - శిల్పాశెట్టిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని