
హైదరాబాద్: కరోనాతో కళ తప్పిన వెండితెర.. మళ్లీ కొత్త వెలుగులు సంతరించుకోనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి థియేటర్లు తెరవడానికి అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెండితెర వినోదాలను పునఃప్రారంభించేందుకు థియేటర్, మల్టీప్లెక్స్ యజమానులు సిద్ధమవుతున్నాయి. డిసెంబరు 4నుంచి ఏఎంబీ సినిమాస్‌ను తిరిగి తెరవనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. కథా నాయకుడు మహేష్‌బాబు భాగస్వామిగా వ్యవహరిస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్స్ సంస్థ ఇది. మంగళవారం నుంచే బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ‘టెనెన్ట్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాలు ప్రదర్శించబోతున్నట్లు తెలియజేశారు.
ఏఎంబీ మల్టీప్లెక్స్ ప్రకటనపై రానా, విష్వక్ సేన్ సహా పలువురు స్టార్లు హర్షం వ్యక్తం చేశారు. ‘‘టెనెన్ట్’ను థియేటర్లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ రానా ట్వీట్ ద్వారా తన ఆనందాన్ని పంచుకోగా.. ‘‘మనం మళ్లీ వస్తున్నాం’’ అని విష్వక్ తన సంతోషాన్ని తెలిపారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!