
రేర్ ఫొటో షేర్ చేసిన రేణూదేశాయ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, నటుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో ఉన్న ఓ అపురూప చిత్రాన్ని తాజాగా రేణూదేశాయ్ షేర్ చేశారు. ఇందులో పవన్.. అకీరా-ఆద్యలను ప్రేమతో హత్తుకోగా.. వారిద్దరూ ఆయన భుజాలపై నిద్రపోతున్నట్లు కనిపించారు.
ఒకనాటి ఈ ఫొటోని తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన రేణూ.. ‘కొన్ని అందమైన, ప్రత్యేకమైన ఫొటోలను అందరితో పంచుకోవాలి. అవి కేవలం మీ ఫోన్లోని ఫొటో ఆల్బమ్‌కు మాత్రమే పరిమితం కాకూడదు. నా ఫోన్లో నేను తీసిన ఓ అపురూప చిత్రమిది’ అని పేర్కొన్నారు. రేణూ షేర్ చేసిన 30 నిమిషాల్లోనే ఈ ఫొటోని ఎంతోమంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటించిన ‘వకీల్‌సాబ్’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనితోపాటు క్రిష్, సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవన్ సినిమాలు చేయనున్నారు. మరోవైపు, రేణూదేశాయ్ సైతం ‘ఆద్య’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!