అలరిస్తోన్న ‘ఆకాశవాణి’ జాతర సాంగ్‌ - akasavani dimsare lyrical video released starring samuthirakani vinay varma teja kakumanu prashant
close
Published : 10/07/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలరిస్తోన్న ‘ఆకాశవాణి’ జాతర సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్‌.ఎస్‌. రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. సముద్ర ఖని, వినయ్‌ వర్మ, తేజ, ప్రశాంత్‌ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమాలోని ‘దిమ్సారే’ అనే లిరికల్‌ వీడియోను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. జాతరకి సంబంధించిన ఈ గీతం ఆద్యంతం అలరిస్తోంది. అడవి లొకేషన్లు, నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా కాల భైరవ స్వరాలు సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. విజయ్‌ బాలాజీ, కాల భైరవ, హైమత్‌, ఆదిత్య అయ్యంగార్‌ కోరస్‌ అందించారు. ఈ సినిమా జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు. ప‌ద్మ‌నాభ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని