‘బిల్లా’ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యా - anushka shocked
close
Published : 27/04/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిల్లా’ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సూపర్‌’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి. అనతి కాలంలోనే దక్షిణాదిలో అగ్ర నాయికల జాబితాలో చేరింది. ఓ వైపు అభినయానికి పెద్ద పీట వేస్తూనే మరోవైపు అందాల పాత్రల్లో కనిపించి అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్‌ హీరోగా మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన ‘బిల్లా’ చిత్రం కోసం బికినీ వేసి కుర్రకారుని హీట్‌ ఎక్కించిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగతంగా అనుష్కకి ఇలాంటివి ఇష్టం ఉండవు. సినిమాల్లోకి రాకముందు కేవలం సల్వార్‌ కమీజ్‌లనే ధరించేది. పాత్ర డిమాండ్‌ మేరకు బిల్లా చిత్రంలో ట్రెండీ డ్రెస్‌లు వేసుకుని మెప్పించింది. ఇక్కడే అనుష్క షాక్‌కి గురైంది. ‘నేను ఎప్పుడూ పద్ధతిగా ఉండాలనుకుంటుంది మా అమ్మ. అలాంటి ఆమె ‘బిల్లా’ సినిమా చూసినప్పుడు.. ఇంకా స్టైలిష్‌గా ఉండొచ్చు కదా. సగం పద్ధతిగా, సగం మోడ్రన్‌గా ఆ డ్రెస్సులేంటి అని అంది. అప్పుడు నేను చాలా షాకయ్యా’ అని ఓ సందర్భంలో ఈ విషయాన్ని పంచుకుంది స్వీటీ. ఇటీవల ‘నిశ్శబ్దం’ చిత్రంతో అలరించిన ఈ భామ తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని