జోరుగా.. హుషారుగా...! - bollywood movies starts their shootings
close
Published : 23/06/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జోరుగా.. హుషారుగా...!

హిందీ చిత్రసీమలో కొత్త ఉత్సాహం నెలకొంది. కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో షూటింగ్‌లు మొదలయ్యాయి. కొన్ని సినిమాలు విడుదల కోసం ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సెట్లోకి అడుగుపెట్టేశాయి. రెట్టించిన హుషారుతో సినిమాను పూర్తి చేసేస్తున్నాయి ఆయా చిత్రబృందాలు. మరిన్ని తాజాగా చిత్రీకరణను మొదలుపెట్టాయి. కొన్ని బృందాలు ఎప్పటి నుంచి సెట్స్‌పైకి వెళ్లాలో ప్రణాళికలు వేసుకున్నాయి.

‘రక్షా బంధన్‌’ షురూ

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘రక్షాబంధన్‌’. భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం మొదలైంది. గత ఏడాది రాఖీ పండగ రోజు ఈ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా ఇది పట్టాలెక్కలేదు. ఇటీవలే దీని సెట్లోకి అక్షయ్‌కుమార్‌ అడుగుపెట్టారు. ‘‘నా సోదరే నాకు తొలి స్నేహితురాలు. మాది ఎంతో విలువైన స్నేహం. మా బంధానికి గుర్తుగా ‘రక్షాబంధన్‌’ని ఆమెకు అంకితం ఇస్తున్నాను’’అని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో అక్షయ్‌ చెల్లెళ్లుగా షహీజ్‌మీన్‌ కౌర్, దీపికా ఖన్నా, సాదీయా ఖటీబ్, స్మృతి శ్రీకాంత్‌ నటిస్తున్నారు. దీన్ని ఈ ఏడాది నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


టైగర్‌...సెప్టెంబర్‌

బాలీవుడ్‌ యువ యాక్షన్‌ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ నుంచి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వికాస్‌భల్‌ దర్శకత్వంలో టైగర్‌ నటిస్తున్న చిత్రం ‘గణపథ్‌’. దీన్ని గత ఏడాదే మొదలుపెట్టాల్సి ఉన్నా కొవిడ్‌ తీవ్రతతో కుదరలేదు. ప్రస్తుతం సెప్టెంబరు 20 నుంచి ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాక్సింగ్‌కు సంబంధించిన కొత్త టెక్నిక్స్‌తో పాటు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకుంటున్నాడు టైగర్‌.


‘బ్రహ్మాస్త్ర’ @ బుడాపెస్ట్‌

రణ్‌బీర్‌కపూర్, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రానికి తొలి నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి. 2018 మొదలైన ఈ సినిమా చివరి దశకు చేరుకున్నాకా కొవిడ్‌ మొదలైంది. రెండో వేవ్‌ రాకముందే సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో అలియాభట్, రణ్‌బీర్‌ కపూర్‌లు కరోనా బారిన పడ్డారు. ఇప్పడు ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక షెడ్యూల్‌ను బుడాపెస్ట్‌లో తెరకెక్కించనున్నారు. దాని కోసం చిత్రబృందమంతా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకుని హంగేరీకి వెళ్లనుంది. ఆగస్టు తర్వాత షూటింగ్‌ తిరిగి మొదలు కానుంది. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పరిస్థితులు బాగున్నప్పుడే సినిమాని పూర్తి చేసుకొని తొలి కాపీ సిద్ధం చేసుకుంటే మేలని చాలామంది దర్శకనిర్మాతలు త్వరపడుతున్నారు. అందుకే మరిన్ని చిత్రాలు సెట్స్‌ మీదకు వెళుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని