Radhe: దిల్‌ దే దియా చూశారా - dil de diya song from radhe
close
Published : 01/05/2021 08:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radhe: దిల్‌ దే దియా చూశారా

ఇంటర్నెట్‌ డెస్క్‌: సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాధే’. దిశా పటానీ నాయిక. ఈ చిత్రంలోని ‘దిల్‌ దే దియా’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. సల్మాన్‌, జాక్వెలిన్‌పై రూపొందించిన ప్రత్యేక గీతమిది. బీట్‌కి తగినట్టు స్టెప్పులేసి ఈ ఇద్దరూ హుషారెత్తిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ‘సీటీమార్‌’ పాట యూ ట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు సొంత చేసుకుని రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ‘దిల్‌ దే దియా’ సైతం అదే స్థాయిలో హవా కొనసాగిస్తోంది. విడుదలైన కొన్ని క్షణాల్లో కొన్ని వేల మంది ఈ పాటని తిలకించారు. షబ్బీర్‌ అహ్మద్‌ రచించిన ఈ గీతాన్ని కమాల్‌ ఖాన్‌, పాయల్‌ దేవ్‌ ఆలపించారు. హిమేశ్‌ రేష్మియా సంగీతం అందించారు. మే 13న థియేటర్లలతోపాటు ఓటీటీ వేదికగానూ ఈ చిత్రం విడుదల కానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని