దాక్కో దాక్కో మేక
close
Updated : 03/08/2021 05:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాక్కో దాక్కో మేక

‘పుష్ప’ ప్రచారం షురూ కానుంది. ఈ చిత్రం తొలి పాటని ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ప్రకటించారు కథానాయకుడు అల్లు అర్జున్‌. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి పాటని విడుదల చేయనున్నారు. ‘దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక...’ అంటూ సాగే తెలుగు గీతాన్ని శివమ్‌ ఆలపించారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ - దేవిశ్రీప్రసాద్‌ కలయికలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య2’ పాటలు విశేష ఆదరణ పొందాయి. పదేళ్ల తర్వాత ఈ కలయికలో వస్తున్న సినిమానే ‘పుష్ప’. శేషాచలం అడవుల్లో... ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ సందడి చేయనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని