close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్‌ ఆర్‌ ఆర్‌... మరో మజిలీ

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణ పరుగులు పెడుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత ఆలస్యంగా రంగంలోకి దిగిన చిత్రబృందం, యాభై రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసింది. హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్‌ని త్వరలోనే మొదలు పెట్టనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో కథానాయికగా నటిస్తున్న ఆలియాభట్‌ కూడా తదుపరి షెడ్యూల్‌లోనే రంగంలోకి దిగబోతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఆ ఇద్దరూ సందడి చేయబోతున్నారు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ 300 కోట్లు పైచిలుకు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు