close
Published : 03/07/2020 23:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోసారి పోలీస్‌గా?

యువ కథానాయకుడు శర్వానంద్‌ మరోసారి పోలీస్‌ పాత్రలో సందడి చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. శర్వానంద్‌ కథానాయకుడిగా యువీ క్రియేషన్స్‌లో ఓ చిత్రం రూపొందబోతోంది. శ్రీరామ్‌ అనే ఓ యువ దర్శకుడు దీన్నితెరకెక్కించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పోలీస్‌ కథతో రూపొందుతోంది. శర్వానంద్‌ పోలీస్‌ పాత్రలో సందడి చేయబోతున్నట్టు సమాచారం.

ఇదివరకు ఆయన ‘రాధ’ చిత్రంలోనూ పోలీస్‌గా నటించారు. ప్రస్తుతం శర్వానంద్‌ ‘శ్రీకారం’తో పాటు మరో ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నారు. అవి పూర్తయ్యాక కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని