అశుతోష్‌ దర్శకత్వంలో..!
close
Published : 20/10/2021 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అశుతోష్‌ దర్శకత్వంలో..!

శుతోష్‌ గొవారికర్‌ అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది చారిత్రక చిత్రాలే. భారీ స్థాయిలో చరిత్ర కథలను తెరకెక్కించే ఆయన కొత్తదారిలో వెళ్లనున్నారు. ఓ యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి  సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఫరాన్‌ అక్తర్‌ ప్రధాన పాత్ర పోషించనున్నారు. నాయికగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందులో విలన్‌గా  జగపతిబాబుని ఓకే చేసినట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఓ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా ఫరాన్‌ కనిపించనున్నారట. ఈ సినిమాకి ‘పుకార్‌’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. డిసెంబరులో  ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని