20 లీటర్ల డీజిల్‌ పోయిస్తే.. వచ్చింది 13 లీటర్లే!
close
Updated : 05/08/2021 07:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

20 లీటర్ల డీజిల్‌ పోయిస్తే.. వచ్చింది 13 లీటర్లే!

గార్లదిన్నె, శింగనమల, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల పరిధిలోని మర్తాడు క్రాస్‌ వద్ద ఉన్న ఓ పెట్రోలు బంకులో డీజిల్‌ తక్కువ వేశారని ఓ వినియోగదారుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక బంకులో బుధవారం ఓ క్యాన్‌లోకి 20 లీటర్ల డీజిల్‌ వేయించుకున్నారు. ఆ తర్వాత అనుమానంతో డీజిల్‌ను అక్కడే ఉన్న సిబ్బందితో కొలత వేయించటంతో ఏకంగా ఏడు లీటర్లు తక్కువ వచ్చింది. దీంతో ఆ వినియోగదారుడు పెట్రోల్‌ బంకులో తక్కువ కొలతతో పోస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటన వైరల్‌గా మారింది. పెట్రోల్‌ బంకులో అక్కడి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు బంకు యజమానులు చెబుతున్నారు. వినియోగదారుడికి విషయం తెలిపినా పట్టించుకోకుండా ఇలా చేశారని చెప్పారు. ఈ సంఘటనపై శింగనమల తహసీల్దారు విశ్వనాథ్‌ను వివరణ కోరగా.. పెట్రోల్‌ బంకులోని యంత్రాలను పరిశీలన చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు.

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని