close
అప్పటి ముచ్చట్లు
గొల్లపూడి తీరని కోరిక..!

ఇంటర్నెట్‌డెస్క్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావుకు తీరని కోరిక ఒకటి ఉండిపోయిందట. ఈ విషయాన్ని ఆయన తన ఆత్మకథ ‘అమ్మకడుపు చల్లగా’లో బయటపెట్టారు. విజయవాడలో ఆయన మిత్రుడు ‘నవోదయ ప్రకాశరావు’ ఒక మడత కుర్చీని ఆయనకు బహూకరించారు. అప్పట్లో ఆయనకు దానితో బలమైన బంధం ఉండేది. ఆయన చాలా రచనలకు అది వేదికైంది. ‘‘ఈ కుర్చీ ఎప్పుడు దూరమైందో తెలీదు. నాకు పెళ్లయి, పిల్లలు పుట్టి, వాళ్లు పెద్దవాళ్లయ్యే వరకు అది నాదగ్గరే ఉంది. నాతో ఊళ్లు తిరిగింది. చాలా రచనలు  అందులో కూర్చొనే చేశాను. సంవత్సరాల తరబడి దాని సుఖాన్ని నేను మరిగాను.. నా సాహితీ వ్యాసంగాన్ని కుర్చీ మరిగింది’’ అంటూ గుర్తు చేసుకొన్నారు. ఆయన తన ఆత్మకథలో దీనిని ప్రస్తావిస్తూ..‘‘ వయసుమళ్లాక నరసరావుపేట కుర్చీ కొనుక్కుని.. రెండుకాళ్లూ కుర్చీ చేతుల మీద చాచి కూర్చోవాలని సరదా. కానీ, కుర్చీ రాలేదు. కొన్ని చిన్న కోరికలే  ఏవో కారణలకు మూలపడతాయి’’ అని నిట్టూర్చారు.  


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.