కార్గిల్‌ వెళ్లనున్న లాల్‌సింగ్‌ చద్దా! - lal singh chadha final schedule shooting in kargil between may-june!
close
Published : 20/02/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్గిల్‌ వెళ్లనున్న లాల్‌సింగ్‌ చద్దా!

ఇంటర్నెట్‌ డెస్క్: ఆమీర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. గత రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇదొకటి. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తుది షెడ్యూల్ కార్గిల్‌లో చిత్రీకరించనున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అక్కడ మంచు కరిగే వరకు చిత్రబృందం వేచి చూసి ఆ తరువాత మే - జూన్ నెలల్లో యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించునున్నారు. కథలో ఈ సన్నీవేశాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ మధ్య ఆమీర్ ఈ చిత్రం గురించి సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ..‘‘సినిమా చిత్రీకరణ సీరియస్‌గా సాగుతున్న సమయంలో తరచూ కాల్స్‌, సందేశాలు వస్తున్నాయి. దీంతో నా పాత్రపై దృష్టి పెట్టలేకపోతున్నా. అందుకే సినిమా విడుదలయ్యే వరకూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నట్లు చెప్పారట. ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్న ఈ కామెడీ-డ్రామా చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. 1994లో హాలీవుడ్ విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి చిత్రానికి ఇది రీమేక్. 105 కోట్ల బడ్జెతో నిర్మితమవుతోన్న ఇందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న చిత్రం విడుదల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని