దిల్లీ: ఆన్లైన్లో మూవీ టికెట్లు విక్రయించే బుక్ మై షో సంస్థ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించింది. పే పర్ వ్యూ, సినిమా పూర్తిగా కొనుక్కోవడం, అద్దెకు తీసుకునే (వీడియో ఆన్ డిమాండ్) సేవలను ప్రారంభించింది. 600 సినిమాలు, 72 వేల గంటల కంటెంట్‌తో ఈ స్ట్రీమింగ్ సేవలను తీసుకొచ్చింది. దేశీయ సినిమాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను సైతం తమ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంపై అందుబాటులో ఉంటాయని బుక్ మై షో ఓ ప్రకటనలో తెలిపింది.
నిర్ణీత సమయంలో మూవీని వీక్షించేందుకు అద్దెకు తీసుకోవడం, లేదంటే పూర్తి సినిమాను కొనుగోలు చేసి ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటునూ యూజర్లకు కల్పిస్తున్నట్లు బుక్ మై షో పేర్కొంది. రూ.40 నుంచి రూ.700 వరకు వీటి ధరలు ఉంటాయని పేర్కొంది. సోనీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ పిక్చర్స్ వంటి విదేశీ దిగ్గజ ప్రొడక్షన్ కంపెనీలతో పాటు దేశీయ ప్రొడక్షన్ హౌజ్లైన వయాకామ్ 18, షేమరూ, రాజశ్రీ ప్రొడక్షన్స్ తదితర వాటితో ఒప్పందం చేసుకున్నట్లు బుక్ మై షో సీఓఓ ఆశిష్ సక్సేనా పేర్కొన్నారు. బుక్ మై షో మొబైల్ యాప్ ద్వారా గానీ, వెబ్సైట్ ద్వారా గానీ ఈ స్ట్రీమింగ్ సేవలను పొందొచ్చని తెలిపారు. యాపిల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, ఫైర్ స్టిక్, క్రోమ్ క్యాస్ట్, డెస్క్ టాప్ బ్రౌజర్స్ ద్వారా కూడా స్ట్రీమింగ్ సేవలు ఆస్వాదించొచ్చని వెల్లడించారు.
ఇదీ చదవండి..
నెట్‌ఫ్లిక్స్.. సమయానికి ఆపేయొచ్చు!
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ