close
Published : 12/04/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘టక్‌ జగదీష్‌’ విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవల ‘లవ్‌ స్టోరీ’ చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. నాని హీరోగా నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌’ విడుదల కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ‘‘ప్రస్తుతం నెలకొన్న కారణాల వల్ల ‘టక్‌ జగదీష్‌’ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. తదుపరి విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తాం’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంతోనే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుందా.. లేక వేరే ఏమైనా కారణాలున్నాయా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్‌ జగదీష్‌’ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నాని సరసన రీతూవర్మ సందడి చేయనుంది. జగపతిబాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. తమన్‌ సంగీతం అందించారు. శివనిర్వాణతో కలిసి నాని చేస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్ను కోరి’ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని