బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌  - nandamuribalakrishna fans organized a special covid19 vaccination
close
Published : 10/06/2021 23:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టారు. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 700 మందికిపైగా టీకాలు వేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌, నిర్మాత రామ్‌ ఆచంట, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

ఈ రోజు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పలువురు సినిమా ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టనందున అభిమానులెవరూ తనను కలవడానికి రావొద్దని బాలకృష్ణ తన అభిమానులను కోరారు. అందరూ ఆరోగ్యంగా ఉండటమే తనకు ముఖ్యమన్నారు. దీంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్యను కలిసేందుకు ఎవరూ హైదరాబాద్‌కు వెళ్లలేదు. కాగా.. ఆయన మాత్రం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో నిరాడంబరంగా తన పుట్టినరోజు చేసుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని