సర్పంచిగా సందడి చేస్తోన్న రాజా రవీంద్ర! - sridevi drama company latest promo
close
Published : 10/05/2021 22:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్పంచిగా సందడి చేస్తోన్న రాజా రవీంద్ర!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నువ్వు సర్పంచిగా గెలిచావు. ఈ రోజు నుంచి ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు’ అని నటుడు రాజా రవీంద్రని ఉద్దేశించి డైలాగ్‌ చెప్తూ నవ్వుల పూయిస్తున్నాడు హైపర్‌ ఆది. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి విచ్చేశారు రాజా రవీంద్ర. తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ షోలో రాజా సర్పంచిగా కనిపించి తనదైన శైలిలో కామెడీ పండించారు. ఆటో రాం ప్రసాద్‌, సుడిగాలి సుధీర్‌కి కౌంటర్‌ ఇస్తూ సందడి చేశారు. ఈ అల్లరితోపాటు ఓ ప్రత్యేక గీతం, రేవంత్‌ గానం ఆకట్టుకుంటున్నాయి. మరి రాజా రవీంద్ర సర్పంచిగా మారి ఏం చేశాడు? ఈ గ్యాంగ్‌తో ఆయనకున్న సంబంధం ఏంటి తెలియాలంటే మే 16 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని