close
Published : 15/04/2021 20:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రైలర్‌: ఆహాలో ‘తెల్లవారితే గురువారం’ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీ సింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా కలిసి నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల, సత్య, అజయ్‌, వైవా హర్ష తదితరులు నటించారు. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 27న  ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా ఏప్రిల్‌ 16న తెలుగు ఓటీటీ వేదికైనా ‘ఆహా’లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆహా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది. చిత్రానికి కాలభైరవ సంగీతం అందించగా సురేష్ రగుతు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. సత్య గిడుతూరి ఎడిటర్‌గా పనిచేశారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మాతలు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని