Radhe: హుషారెత్తిస్తోన్న టైటిల్‌ ట్రాక్‌ - radhe title track
close
Published : 05/05/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radhe: హుషారెత్తిస్తోన్న టైటిల్‌ ట్రాక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాధే’. దిశా పటానీ నాయిక.  తాజాగా టైటిల్‌ గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. సల్మాన్‌, దిశా డ్యాన్సు అలరిస్తోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లు ఆకట్టుకుంటున్నాయి. సాజిద్‌ ఈ పాటని రచించి, ఆలపించారు. సాజిద్‌- వాజిద్‌ ద్వయం స్వరాలు సమకూర్చారు. కొరియోగ్రాఫర్‌ ముదాస్సర్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ఈ పాట తెరకెక్కింది. మే 13న థియేటర్లలతోపాటు ఓటీటీ వేదికగానూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘సీటీమార్‌’, ‘దిల్‌ దే దియా’ గీతాలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని