Tollywood Heroins: కొత్త సినిమా కబురేది? - succesful heroines not yet signed new telugu projects
close
Updated : 16/06/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Heroins: కొత్త సినిమా కబురేది?

కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న హీరోయిన్లు

ఒక్క విజయం ఖాతాలో పడితే చాలు. అవకాశాలు ఇంటి గుమ్మం ముందు వరుస కడతాయి. హిట్ సినిమాలకున్న విలువ అలాంటిది. హీరోయిన్లకైతే ఒకేసారి రెండు మూడు చిత్రాలు చేతిలో పడతాయి. అయితే ప్రస్తుతం సూపర్‌ హిట్లు సాధించినా కొందరు హీరోయిన్లు మాత్రం తెలుగులో కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించట్లేదు. చిత్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చేతిలో విజయాలున్నా కొత్త సినిమా కబుర్లు చెప్పని ఆ  భామలెవరో చూద్దాం.

చిట్టీ.. మళ్లీ పేలేదెప్పుడో..!

మొదటి సినిమాతోనే లక్ష్మీ పటాస్‌లా పేలింది ఫరియా. అందంతోనే కాదు, కామెడీ పంచులతోనూ అలరించింది. చిన్న సినిమాగా విడుదలై, భారీ వసూళ్లు సాధించిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో చిట్టిగా అదరగొట్టింది. నవీన్‌ పొలిశెట్టితో కలిసి పంచిన వినోదానికి టాలీవుడ్‌ ఫిదా అయింది. మొదటి చిత్రమే ఇంత పెద్ద విజయం అందుకొన్నప్పటికీ రెండో సినిమాను ప్రకటించలేదు ఫరియా. ఆమె చేయబోయే కొత్త చిత్రం ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.  రవితేజ, ప్రభాస్‌, మంచు విష్ణుకు జోడీగా నటించనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నా.. అవి అధికారికంగా వెల్లడికాలేదు.

ఆచితూచి అడుగేస్తూ..

‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగునాట ప్రవేశించింది వర్ష బొల్లమ్మ. సమంత, శర్వానంద్‌ల ‘జాను’లోనూ మెరిసింది. గతేడాది ఆనంద్‌ దేవరకొండతో కలిసి చేసిన ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. గుంటూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌కు కొత్త ఒరవడిని పరిచయం చేసింది. ఈ చిత్ర విజయానంతరం చాన్నాళ్ల వరకు తెలుగు సినిమాలేవీ ప్రకటించలేదు. సినిమాల ఎంపికలో నిదానం పాటిస్తోందీ భామ. ఈ మధ్యే రాజ్‌ తరుణ్‌తో ‘స్టాండప్‌ రాహుల్‌’ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఇదొక్కటి తప్ప మరో తెలుగు సినిమా ఆమె చేతిలో లేదు.

 కోలీవుడ్‌లో బిజీబిజీ

‘గ్యాంగ్‌ లీడర్‌’తో తెలుగులో అరంగేట్రం చేసిన నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌. అందం, అభినయాలతో సినీ ప్రేమికుల మనసులు దోచుకుంది. శర్వానంద్‌తో తీసిన ‘శ్రీకారం’తో ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. అదే తెలుగులో చివరి సినిమా. మళ్లీ మరో తెలుగు సినిమాపై ఆమె దృష్టి పెట్టలేదు. తమిళంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తూ..అక్కడ అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తోంది. ప్రస్తుతం సూర్య, శివకార్తికేయన్‌, విజయ్‌ల సరసన నటిస్తోంది. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’లో నటించే అవకాశం దక్కిందన్న వార్త మాత్రం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్‌పై మళ్లీ శ్రద్ధ ఎప్పుడో?

మిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉండే నటి శ్రద్ధా శ్రీనాథ్‌. తెలుగులో నాని హీరోగా ‘జెర్సీ’తో మంచి హిట్‌ అందుకుంది. మధ్యతరగతి ఇల్లాలు సారాగా నటించి మంచి మార్కులు కొట్టేసిందీ భామ. ఓటీటీలో విడుదలైన ‘కృష్ణ అండ్‌ హిస్‌ లీలా’లోనూ హీరోయిన్‌గా నటించింది. అది ఓటీటీలో మంచి విజయాన్ని సాధించింది. ‘మార’, ‘చక్ర’ లాంటి అనువాదాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. తెలుగులో మరో  సినిమాకు ఇంకా సంతకం చేయలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని