Atrangi Re: ఒకే ఫ్రేమ్‌లో అక్షయ్‌, ధనుష్‌.. అలరిస్తోన్న ‘అత్రాంగి రే’ ట్రైలర్‌ - telugu news atrangi re trailer starring akshay kumar sara ali khan dhanush
close
Published : 24/11/2021 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Atrangi Re: ఒకే ఫ్రేమ్‌లో అక్షయ్‌, ధనుష్‌.. అలరిస్తోన్న ‘అత్రాంగి రే’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్‌ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అత్రాంగి రే’. సారా అలీఖాన్‌ కథానాయిక. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ట్రైలర్‌ని విడుదల చేసింది. ధనుష్‌ కిడ్నాప్‌ అయిన సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్‌ సందడి చేశారు. ప్రేమికులైన ధనుష్‌, సారా అలీఖాన్‌ గొడవ పడుతూ అలరించారు. ధనుష్‌ను దూరంపెట్టిన సారా అలీఖాన్‌ అక్షయ్‌ కుమార్‌కు ఎందుకు దగ్గరైందన్నది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని ఆనంద్‌ ఎల్‌. రాయ్‌, భూషణ్‌ కుమార్‌, హిమాన్షు శర్మ, కృష్ణన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని